CM kcr's old friend benifiting TRS party..? ఈ అసక్తికర పరిణామాలు.. అందుకు సంకేతాలా..!

Cm kcr s old friend benifiting trs party alleges ttdp leader

Telangana Assembly, Chandrababu, Revanth reddy, congress, shabbir ali, ponguleti, sampath, Telangana, Telangana CM KCR, KCR, TRS, Maha kutami, TTDP, Revanth Reddy Termination, Revanth Reddy Sack, Revanth Reddy Oust, Revanth Reddy, Revanth Reddy Issue, TTDP L Ramana Revanth Reddy, Revanth Reddy Ramana, TTDP Ramana Letter Chandrababu, Revanth Reddy Unofficial Ban, Politics

Telangana Congress Leaders mohammad ali shabbir, ponguleti, sampath and few others huged and welcomed Telangana TDP leader Revanth reddy at Telangana assembly bac meet.

ఈ అసక్తికర పరిణామాలు.. అందుకు సంకేతాలా..?!

Posted: 10/26/2017 01:35 PM IST
Cm kcr s old friend benifiting trs party alleges ttdp leader

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అంతర్గత అధిపత్యం కోసం సాగుతున్న రాజకీయాలు వేడెక్కుతున్నాయన్న తరుణంలో ఇవాళ మరింత జఠిలంగామారాయి. పార్టీ ప్రెసిడెంట్ రమణ తాజాగా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఇచ్చిన మెసేజ్ నేపథ్యంలో.. వెనక్కు తగ్గిన రేవంత్.. ఇవాళ నిర్వహించిన తలపెట్టిన టీడీఎల్పీ సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. కాగా ఆయన టీడీఎల్పీ నేత హోదాలో కూడా వ్వవహరించలేదు. తెలంగాణ అసెంబ్లీ ఢిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అధ్వర్యంలో జరిగిన బిఏసీ సమావేశాలకు కూడా రేవంత్ హాజరుకాలేదు.

ఎల్ రమణ తాజా సందేశాలతో నోచ్చుకున్న రేవంత్ రెడ్డి ఈ క్రమంలో తన అవేదనను వ్యక్తం చేశారు. చంద్రబాబు వచ్చేలోపు ఇక్కడ పార్టీని నాశనం చేయాలని కొందరు తాపత్రయ పడుతున్నారని కూడా ఆరోపించిన ఆయన ఇక బీఏసీ సమావేశం నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన ఆయనను కాంగ్రెస్ సీనియర్ నేతలు మహమ్మద్ అలీ షబ్బీర్, పోంగులేటి సుధాకర్ రెడ్డి, సంపత్ సహా పలువురు నేతలు అలింగనం చేసుకున్నారు. పోంగులేటి, సంపత్ లు ఆయనకు కరాచలనం చేసి మారీ స్వాగతం పలికారు.

అ వెనువెంటనే అసెంబ్లీలోని టీటీఎల్సీ ఛాంబర్లో తనకు కేటాయించిన సీటులో అసీనులు కాని రేవంత్.. పక్కగా మరో కుర్చీ వేసుకుని కూర్చున్నారు. రమణ అదేశాల నేపథ్యంలో బిఏసీ సమావేశాలకు హాజరుకాని అయన.. ఛాంబర్ లోని తన ఫైల్స్ తో పాటుగా తన కంప్యూటర్ ను కూడా తీసుకెళ్లిపోయాడు. కాంగ్రెస్ నేతల అలింగనాలు, టీటీడీఎల్సీలో తన ఫైల్స్ తీసుకెళ్లడాలన్నింటినీ పరిశీలించి ఈ అసక్తికర పరిణామాలు తాను పార్టీ మారుతున్నానని చెప్పకనే చెప్పడానికి సంకేతాలా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana Assembly  Chandrababu  Revanth reddy  congress  shabbir ali  ponguleti  sampath  Telangana  Politics  

Other Articles